చల్లపల్లి సుందరీకరణలో భాగంగా మండలంలో డంపింగ్ యార్డు తొలగింపు, డ్రెయినేజీ నిర్వహణ తదితర అవసరాల కోసం కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులు కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ తెలిపారు. మచిలీపట్నం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో శుక్రవారం ఆయన సీఎస్ఆర్ నిధుల వినియోగంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చల్లపల్లిలో పారిశుధ్యం నిర్వహణ తదితర అంశాలపై అధికారులను ఆరా తీశారు.