మచిలీపట్నం: పనులను వేగవంతం చేసి పురోగతి సాధించాలి

56చూసినవారు
మచిలీపట్నం: పనులను వేగవంతం చేసి పురోగతి సాధించాలి
జిల్లాలో మనబడి-మన భవిష్యత్తు కింద చేపట్టిన పనులను వేగవంతం చేసి పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం మచిలీపట్నంలో అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మనబడి మన భవిష్యత్తు కింద రెండవ దశలో 488 పాఠశాలల్లో 180 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పలు రకాల మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు.

సంబంధిత పోస్ట్