అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్

75చూసినవారు
మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామం వద్ద ఆదివారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకున్నట్టు ఎస్సై వైవీవీ. సత్యనారాయణ తెలిపారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ.. కే. కొత్తపాలెం నుంచి మచిలీపట్నానికి ఎలాంటి రసీదులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను పెదప్రోలు వద్ద అదుపులోకి తీసుకొని, స్టేషను తరలించామన్నారు. తదుపరి చర్యల నిమిత్తం తాహశీల్దార్ కార్యాలయానికి అప్పగించామన్నారు.

సంబంధిత పోస్ట్