Feb 10, 2025, 14:02 IST/
రంగరాజన్‌పై దాడి క్షమార్హం కాదు: RSS
Feb 10, 2025, 14:02 IST
చిలుకూరు దేవాలయం ప్రధానార్చకుడు రంగరాజన్‌పై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) వెల్లడించింది. రంగరాజన్‌పై అమానుష దాడి గురించి ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని కోరింది. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు RSS ఓ ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరింది.