నాగాయలంక మండల పరిషత్ కార్యాలయములో ప్రతి గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ కి, ఒక వార్డు సభ్యునికి మండల స్థాయిలో రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఎంపీడీఓ సోమవారం ప్రారంభించారు. మొదటి రోజు కార్యక్రమంలో మండల రెవిన్యూ అధికారి ఎం. హరనాథ్ బాబు, మండల పరిషత్ అభివృద్ధి సీతారామ కుమార్, వక్కపట్లవారిపాలెం సర్పంచ్ అంబటి శ్యామ్ ప్రసాద్, మండల విస్తరణాధికారి కె. అప్పల నరసమ్మ పాల్గొని సభ్యులకు అవగాహన కల్పించారు.