నూజివీడు పట్టణంలోని ఆర్ఆర్ పేటలో శుక్రవారం ప్రారంభించిన అన్న క్యాంటీన్లో మంత్రి కొలుసు పార్థసారథి బ్రేక్ ఫాస్ట్ చేసారు. మంత్రి ఈ సందర్భంగా స్వయంగా టిఫిన్ వడ్డించుకున్నారు. పేదలందరికీ ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.