నూజివీడు నుండి ముసునూరు మీదుగా ఏలూరు వెళ్లే ప్రధాన రహదారి డబుల్ రోడ్డుగా మంజూరై నాలుగున్నర సంవత్సరాలు గడిచినప్పటికీ ఇంతవరకు రోడ్డు నిర్మాణం చేపట్టంపై సిపిఐ నూజివీడు నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం సింహాద్రిపురం గ్రామం వద్ద సుమారు గంట పాటు రాస్తారోకో చేశారు. ఈ రాస్తారోకోలో సిపిఐ కార్యకర్తలతో పాటు గ్రామస్తులు, ప్రయాణికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.