ఎన్డీఏ మహా కూటమి ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేస్తుందని రెడ్డిగూడెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముప్పిడి నాగేశ్వరరెడ్డి, జనసేన అధ్యక్షులు కాంతారావు, బిజెపి అధ్యక్షులు బలగని గోపి పేర్కొన్నారు. రెడ్డిగూడెంలో వారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ మహాకూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను క్రమేపి అమలు చేస్తుందన్నారు.