Sep 15, 2024, 03:09 IST/చొప్పదండి
చొప్పదండి
ఆదాయం ఘనం.. వసతులు శూన్యం
Sep 15, 2024, 03:09 IST
కరీంనగర్ జిల్లాలోనే అత్యధిక ఆదాయాన్ని సాధించే గంగాధర సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కనీస వసతులు కరవయ్యాయి. దశాబ్దాల క్రితం నిర్మించిన ఇరుకైన భవనంలో నిత్యం రిజిస్ట్రేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. దీంతో కార్యాలయానికి ప్రతిరోజు వందల్లో వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం కూర్చోవడానికి కూడా కుర్చీలు, తాగునీటి వసతులు లేవని శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.