సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. సైకిల్ పై ఓ బాలిక, యువతి రోడ్డు దాటుతున్నారు. ఇంతలో అటుగా వెళ్తున్న ఓ కారు వారిని బలంగా ఢీకొట్టింది. దీంతో సైకిల్ తొక్కుతున్న యువతి ఎగిరి కిందపడింది. ఈ ఘటనలో బాధితులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వారిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.