గణనాధునికి పూజలు చేసిన ఎమ్మెల్యే

76చూసినవారు
గణనాధునికి పూజలు చేసిన ఎమ్మెల్యే
పెడన రూరల్ మండలం, కొంకెపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన మహా గణపతికి పెడన ఎమ్మెల్యే కాలేక కృష్ణప్రసాద్ మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసి పూజా కార్యక్రమాలు ఎమ్మెల్యే పేరిట నిర్వహించారు. అనంతరం జరిగిన భారీ అన్నసమారాధన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులతోపాటు గ్రామ ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్