పెడన: గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా బళ్ల

69చూసినవారు
పెడన: గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా బళ్ల
పెడన శాఖా గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా బళ్ల మల్లిఖార్జున ప్రసాద్ నియమించినట్లు పెడన పట్టణ తెలుగుదేశం పార్టీ తెలిపింది. పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని పట్టణ టిడిపి అధ్యక్షులు యక్కల శ్యామలయ్య మంగళవారం తెలిపారు. ఆయనతో పాటు సభ్యులుగా వేముల రమేష్, కట్టా గణేష్, బొడ్డు అభిలాష్, రిబ్బా పవన్ నియమితులయ్యారు.

సంబంధిత పోస్ట్