పెడన పట్టణంలోని గుడివాడ బైపాస్ రోడ్డు వద్ద పెడన ఎస్సై- 2 వి. రాజేంద్రప్రసాద్ వాహనాలను మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రికార్డులు సక్రమంగా లేని మరియు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలకు ఆన్లైన్ లో జరిమానా విధించినట్లు తెలిపారు. ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్, ఇతర ధ్రువీకరణ పత్రాలు లేకుండా ప్రయాణాలు చేస్తే జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు.