కెనడాలో ఉద్యోగం పేరుతో సైబర్ నేరగాళ్లు పెనమలూరు మండలం కానూరుకు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ. 35 లక్షలు వసూలు చేశారు. కానూరు గుమ్మడితోటకు చెందిన శామ్యూల్ అనే వ్యక్తి కి వాట్స్ అప్ లో కెనడాలో ఓ గ్యాస్ కంపెనీలో ఉద్యోగం ఉందంటూ సందేశం అందింది. వీసా, ఇతర ధ్రువీకరణ పత్రాల కోసం విడతల వారీగా రూ.35 లక్షల నగదును పంపినట్లు బాధితుడు చెప్పాడు. 4 నెలలుగా ఉద్యోగం రాకపోవడంతో శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.