చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో రెండుమూడేళ్లలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అగ్ర‌గామి కాబోతుంది..!

36171చూసినవారు
చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో రెండుమూడేళ్లలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అగ్ర‌గామి కాబోతుంది..!
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు 75వ జ‌న్మ‌దిన వేడుక‌లు శ‌నివారం గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో టిడిపి ఎంపి అభ్య‌ర్ధి కేశినేని శివ‌నాథ్ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా జ‌రిగాయి. ముందుగా ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల త‌రుఫున చంద్ర‌బాబుకి హృద‌యపూర్వ‌క జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అనంత‌రం చంద్ర‌బాబు జ‌న్మ‌దినం సంద‌ర్భంగా కేశినేని శివాన‌థ్, జాతీయ అధికార ప్ర‌తినిధి కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్, మాజీ మేయ‌ర్ కోనేరు శ్రీధ‌ర్ తో క‌లిసి కేక్ క‌ట్ చేశారు. కార్య‌క‌ర్త‌ల‌కు, మీడియా మిత్రుల‌కి శివ‌నాథ్ స్వ‌యంగా స్వీట్స్ పంచిపెట్టారు.

ఈ సంద‌ర్బంగా కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ చంద్ర‌బాబు ఇలాంటి పుట్టినరోజులు మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని..వ‌చ్చే ఏడాది ముఖ్య‌మంత్రి గా చంద్రబాబు జ‌న్మ‌దిన వేడుక‌లు ఇంకా ఘ‌నంగా నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. దేశంలోనే కాదు, ప్ర‌పంచంలో కూడా గుర్తింపు సంపాదించుకున్న నాయ‌కుడు చంద్రబాబు.. రాబోయే ఎన్నిక‌ల్లో ఎన్డీయే అధికారంలోకి రాబోతుంది..చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి కాబోతున్నార‌ని చెప్పారు. ఆయ‌న రెండు మూడేళ్ల‌ల్లో ఈ గాడి త‌ప్పిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను అగ్ర‌గామి రాష్ట్రంగా దేశంలో నిల‌బెడ‌తార‌న్నారు. త‌మలాంటి నాయ‌కుల‌కి, కార్య‌క‌ర్త‌ల‌కు క్ర‌మ‌శిక్ష‌ణ నేర్పించి, సేవ‌తత్వం బోధించే స్ఫూర్తి ప్ర‌దాత అని కొనియాడారు.

ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర వాణిజ్య విభాగ అధ్య‌క్షుడు డూండీ రాకేష్, రాష్ట్ర తెలుగు మ‌హిళ సంఘం అధ్య‌క్షురాలు షేక్ ఆషా, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మ‌హ్మాద్ ప‌తావుల్లా, టిడిపి అధికార ప్ర‌తినిధి స‌య్య‌ద్ ర‌ఫీ, నాగ‌వంశీకుల సాధికార సంఘం రాష్ట్ర క‌న్వీన‌ర్ ఎరుబోతు రమణారావు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పెరెల్లి ఎలీషా, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మందా వెంక‌టేశ్వ‌ర‌రావు, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్య‌క్షులు సొంగా సంజ‌య్ వ‌ర్మ‌, జిల్లా మైనార్టీ సెల్ నాయ‌కులు క‌రీముల్లా, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ తెలుగుమ‌హిళ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న‌సీమా, క్రిస్టియ‌న్ సెల్ నాయ‌కులు ఊర్ల మోహ‌న‌రావు, తెలుగు దేశం నాయ‌కులు సీనియ‌ర్ న్యాయ‌వాది ఎర్నేని వేద‌వ్యాస్, యువ‌నాయ‌కుడు పొట్లూరి ద‌ర్షిత్ లతోపాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర‌, జిల్లా స్థాయి నాయ‌కులు, తెలుగు మ‌హిళ సంఘం నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్