ఏపీలో నామినేషన్ వేసిన బీఆర్ఎస్ నేత

77చూసినవారు
ఏపీలో నామినేషన్ వేసిన బీఆర్ఎస్ నేత
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేత కొణిజేటి ఆదినారాయణ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కేసీఆర్‌ను కలిసి బీ ఫారమ్ అడగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. బీఫామ్ ఇవ్వటానికి ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అందుబాటులో లేకుండా పోయారన్న ఆదినారాయణ.. బీ ఫారమ్ కోసం అడుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్ బీఫామ్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని అన్నారు.

సంబంధిత పోస్ట్