LIVE VIDEO: కుప్పకూలిన బిల్డింగ్.. ఇద్దరు మృతి

553చూసినవారు
ఢిల్లీలోని కళ్యాణ్‌పురి ప్రాంతంలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటనలో భవనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్