Mar 18, 2025, 17:03 IST/
టెన్త్ ఎగ్జామ్స్.. 'దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటర్' అంటూ సవాల్
Mar 18, 2025, 17:03 IST
ఏపీలో టెన్త్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఓ పరీక్షా కేంద్రం వద్ద రాసిన రాతలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో ఓ ఎగ్జామ్ సెంటర్ గోడపై 'దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరు.. పట్టుకుంటే వదిలేస్తా బుక్ లెట్' అనే రాతలు కనిపించాయి. దాన్ని చూసిన ఇన్విజిలేటర్లు తీవ్రంగా మండిపడ్డారు. ఇది ఆకతాయిల పనే అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇది చూసిన నెటిజన్లు తగ్గేదెలా అంటున్నారు.