విజయవాడ: సీఎం, డిప్యూటీ సీఎం వీడియోలు.. పంచ్ ప్రభాకర్ పై కేసు నమోదు

80చూసినవారు
విజయవాడ: సీఎం, డిప్యూటీ సీఎం వీడియోలు..  పంచ్ ప్రభాకర్ పై కేసు నమోదు
సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై దుర్భాషలు, అనుచిత వ్యాఖ్యలు చేసిన పంచ్ ప్రభాకర్, అతని అనుచరులపై విజయవాడ సైబర్ క్రైం పోలీసులు కేసులు నమోదు చేశారు. 'పంచ్ ప్రభాకర్' యూట్యూబ్ ఛానల్ ద్వారా వీరిని దూషిస్తూ, అసభ్య పదజాలంతో వీడియోలు పెట్టడంతో మొగల్రాజపురానికి చెందిన డి. రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్