ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన ఆదోని ఎమ్మెల్యే

83చూసినవారు
ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన ఆదోని ఎమ్మెల్యే
తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కల్తీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మంగళవారం డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా తాను కూడా తొమ్మిది రోజులు దీక్షలో ఉంటానని ఆయన పేర్కొన్నారు. తిరుమల పవిత్రతకు సీఎం చంద్రబాబు మహా శాంతియాగం చేయించారని చెప్పారు. భక్తులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్