దేవనకొండ మండలం అలారుదిన్నె బ్రిడ్జి ప్రమాదకరంగా మారిందని గురువారం స్థానికులు తెలిపారు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ బ్రిడ్జి భారీ వర్షాలకు మునిగిపోయే దశ వరకు నీరు చేరి ప్రమాదకరంగా మారిందన్నారు. అంతేకాకుండా ఇరువైపులా ఉన్న రక్షణ గోడలు కూలిపోయాయి. నిత్యం ఈ బ్రిడ్జిపై వాహనాలు వెళ్తుంటాయి. ప్రమాదాలు జరగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.