విజయవాడలో మంగళవారం చేపడుతున్న రాష్ట్ర స్థాయి ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న యుటిఎఫ్ నాయకులు, కార్యకర్తల అక్రమ అరెస్టులకు యుటిఎఫ్ నంద్యాల జిల్లా సహాధ్యక్షురాలు శాంతి ప్రియ ఖండించారు. ప్యాపిలి లో మంగళవారం ఆమె మాట్లాడుతూ శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిని అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, అబ్దుల్, లతీఫ్ పాల్గొన్నారు.