సి. బెళగల్ మండల తహసీల్దార్ గా విజయశ్రీ బుధవారం నియామకం అయ్యారు. ఇక్కడ తహసీల్దార్ గా ఉన్న డాక్టర్ అనుపమ ఎన్నికల బదిలీల అనంతరం సొంత జిల్లా అనంతపురంకు బదిలీ అయ్యారు. దీంతో మండలానికి నూతన తహసీల్దార్ గా విజయశ్రీని నియమిస్తూ జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే గూడూరుకు కె. రామాంజినేయులు, కర్నూలు రూరల్ మండలం తహసీల్దార్ గా టీవి రమేష్ బాబు నియమితులయ్యారు.