ఏపీని స్వరాంధ్రప్రదేశ్ మార్చుకుందామని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. మంగళవారం సి. బెళగల్ మండలంలోని పోలకల్లులో ఇది మా మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు. కూటమి ప్రభుత్వ వందరోజుల పాలనలో పింఛన్లు పెంపు, డీఎస్సీ నోటిఫికేషన్, పంచాతీలకు నిధులు, పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారని అన్నారు. 2047 విజన్ సీఎం చంద్రబాబు ప్రణాళికలు అమలు చేస్తున్నారన్నారు.