కర్నూలులోని స్థానిక ఓల్డ్ కంట్రోల్ రూమ్ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాల విద్యార్థి భాస్కర్ రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ రాజేశ్వర్ రెడ్డి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ఈ నెల 21 నుండి 23 వరకు కడప జిల్లా వేంపల్లిలో జరగబోయే రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొని విజేతలుగా తిరిగి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు సుధీర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.