కర్నూల్ కృష్ణా నగర్ సర్వేపల్లి పాఠశాలలో ఫుడ్ కార్నివాల్ ఘనంగా నిర్వహించగా, పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరిత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. విద్యార్థుల వంటకాలను రుచి చూసి ప్రశంసించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణశ్రీ ఆరోగ్యకరమైన ఆహారం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని, ఇంగ్లీషు భయాన్ని తొలగించడంలో కూడా దోహదపడుతుందని అన్నారు.