నందవరం మండల కేంద్రంలోని రహదారి బురదమయంతో అస్తవ్యస్తంగా తయారైంది. ఇదే రహదారిపై పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు రోజు వేళ సంఖ్యల్లో వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. అయితే రహదారిపై వర్షపు నీరు రోడ్లపై నిల్వ ఉండి ప్రమాదాలకు నిలయంగా మారుతుంది. సైడ్ డ్రైనేజీలు లేక ఊళ్ళో ఉండే మురుగు నీరు రహదారిపై పారే దుస్థితి నెలకొంది. దీంతో ప్రయాణీకులు వాహనాలతో జారీ కిందకు పడిన సందర్భాలు ఉన్నాయి.