వైసీపీకి ఇంకా బుద్ధిరాలేదు: రాఘవేంద్రరెడ్డి

82చూసినవారు
వైసీపీకి ఇంకా బుద్ధిరాలేదు: రాఘవేంద్రరెడ్డి
ప్రతిపక్ష హోదా లేని వైసీపీ 100 రోజుల్లో వంద రకాలుగా కూటమి ప్రభుత్వంపై అబద్ధపు, విషప్రచారాలు చేసిందని మంత్రాలయం టీడీపీ ఇన్చార్జి రాఘవేంద్రరెడ్డి అన్నారు. మంత్రాలయం మండలం చెట్నేహళ్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించి 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. వైసీపీకి 11 సీట్లు వచ్చినా బుద్ధి రావడంలేదని రాఘవేంద్ర రెడ్డి ఫైర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్