జాతర సందర్భంగా ఉచితంగా చల్లని మంచి నీటి పాకెట్స్ పంపిణీ

574చూసినవారు
జాతర సందర్భంగా ఉచితంగా చల్లని మంచి నీటి పాకెట్స్ పంపిణీ
మండల కేంద్రం గడివేముల లో గురువారం నాడు మూల పెద్దమ్మ జాతర సందర్భంగా వచ్చిన భక్తులకు ఆర్యవైశ్య సోదరులు చల్లని మంచి నీటి పాకెట్స్ పంపిణీ చేశారు. పాత బస్టాండు లో పద్మావతి కాంప్లెక్స్ నందు ఈపూరి పద్మనాభయ్య , అలాగే సివి రమణయ్య తన గోడౌన్ నందు జాతరకు విచ్చేసిన భక్తులకు ఉచితంగా మంచి నీటి పాకెట్స్ పంపిణీ చేశారు. ఎండ వేడిమి అధికంగా ఉందని, కార్యక్రమం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆర్యవైశ్య సోదరులు తెలిపారు.

సంబంధిత పోస్ట్