అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంకుమార్ పేర్కొన్నారు. మంగళవారం పత్తికొండలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ నారాయణదాసు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. బ్రిడ్జి పూర్తి చేయడంతో పాటు, పంట కాల్వలు పూర్తిచేసి ఎడమ కాల్వకు పందికోన రిజర్వాయర్ నుంచి నీటిని వదలాలని దూదేకొండ ఎంపీటీసీ సభ్యుడు పెద్దఈరన్న సమావేశంలో కోరారు.