రాష్ట్రంలోని రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతూ చేతి వృత్తిదారుల సమాఖ్య కర్నూలు జిల్లా నాయకులు కారన్న ఆధ్వర్యంలో రజక వృత్తి నాయకులు రాజశేఖర్, పెద్దయ్య, గోపాల్ పత్తికొండ ఆర్డీవో భరత్ నాయక్ కు సోమవారం వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడారు. రజక వృత్తిదారులు కేవలం కులవృత్తిపై ఆధారపడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.