ఎమ్మిగనూరు పట్టణ పరిధిలోని లక్ష్మణ్ థియేటర్ సమీపంలో 6 నెలల నుండి మురుగు కాలువ శుభ్రం చేయడం లేదు. దుర్వాసనతో ఆ కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే కాలువలను శుభ్రపరచాలని సిపిఐ పట్టణ కార్యదర్శి రంగన్న డిమాండ్ చేశారు. ఆదివారం సిపిఐ నాయకులతో ఆయన మురికి కాలువలను పరిశీలించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కాలువలను శుభ్రపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు పాల్గొన్నారు.