ఎమ్మిగనూరు: స్కానింగ్ కోసం గర్భిణులకు తిప్పలు
ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు ప్రతి సోమవారం నిర్వహించే స్కానింగ్ తిప్పలు తప్పడం లేదని సోమవారం స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరు చుట్టముట్టు పల్లెల నుంచే గాక మంత్రాలయం, నందవరం, గోనెగండ్ల మండలాల నుంచి సైతం గర్భిణులు నిత్యం ఈ వైద్యశాలకు స్కానింగ్ కోసం వస్తుంటారు. వైద్యశాల సిబ్బంది మాత్రం సమస్యల పరిష్కారం అవేమి తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.