గోనెగండ్ల మండలం వేముగోడు గ్రామ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రేమర మహేష్ అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా, సుజ్ఞానం అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు వేముగోడుకు చెందిన మహేష్, సుజ్ఞానం ద్విచక్రవాహనంపై కోడుమూరుకు వెళ్లి పని ముగించుకొని తిరిగి స్వగ్రామానికి వస్తుండగా, కోడుమూరు వైపు వెళ్తున్న అంబులెన్స్ జీపు వేగంగా ఢీకొనడంతో మహేష్ మృతి చెందాడు.