ఆదోని మండలం చిన్నపెండేకల్ గ్రామంలో గురువారం కురువ చంద్ర అనే రైతు పొలంలో బోరుబావి పైపులైన్లు వేస్తుండగా ఎయిర్ లాక్ కారణంగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో చంద్ర, బసమ్మ, జయరాం అనే ముగ్గురికి తీవ్రగాయాలు కాగా గాయపడిన వారిలో ఒక బాలుడు ఉన్నాడు. బాధితులను ఆదోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు కర్నూలు ఆసుపత్రికి సిఫార్సు చేశారు.