ఆదోనిలో మూడు నూతన బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే

65చూసినవారు
ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారథి ఆర్టీసీ బస్సు నడిపారు. శుక్రవారం మూడు నూతన బస్సు సర్వీసులకు ఆయన తొలుత పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం కొద్దిదూరం బస్సు నడిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితం, సుఖమయం అని అన్నారు. ప్రజలందరూ ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. తమ ప్రాంతానికి కొత్త బస్సులు రావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్