నిందితులను అరెస్టు చేయకుంటే ఉద్యమానికి సిద్ధం
By W. Abdul 57చూసినవారుమాదిగ గుండమ్మని చంపిన నిందితులను 24 గంటల్లో అరెస్టు చేయకపోతే మిలిటెంట్ ఉద్యమానికి సిద్ధమవుతామని జై భీమ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ అన్నారు. శనివారం ఆదోని మండలం నాగనాథనహళ్లి గ్రామంలో గుండమ్మ భౌతికకాయానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. దళిత గిరిజనులపైన హత్యలకు అడ్డుకట్ట వేయకపోతే జిల్లా వ్యాప్తంగా మాదిగలంతా ఉద్యమిస్తారన్నారు.