ఆళ్లగడ్డలో జరుగుతున్నటువంటి ముగ్గుల పోటీలు, గాలిపటం ఎగరవేయు పోటీలు ఆదివారంతో ముగిసాయి. విజేతలకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సోదరి డాక్టర్ వసంత, డాక్టర్ సుజాత బహుమతులు ప్రధానం చేశారు. ముగ్గుల పోటీ మొదటి బహుమతి ఆళ్లగడ్డ లోని పాలసాగరనికి చెందిన జ్యోతి, రెండవ బహుమతి సిరివెళ్ల మండలం యర్రగుంట్ల గ్రామానికి చెందిన లక్ష్మీదేవికి అలాగే గాలిపటం ఎగరవేసే పోటీల్లో గెలిచిన వారికీ బహుమతులు ప్రధానం చేశారు.