మతిస్థితిమితం లేని మహిళను అత్యాచారం చేసిన కేసులో నిందితుడు హనుమంతును అరెస్టు చేసినట్లు ఆస్పరి సీఐ మస్తాన్ వలి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడారు. మండలంలోని ముత్తుకూరు గ్రామంలో ఈనెల 17న మతిస్థిమితం లేని మహిళను హనుమంతు ఇంట్లో బంధించి అత్యాచారం చేసినట్లు కేసు నమోదు చేశామన్నారు. ముత్తుకూరు గ్రామానికి వెళ్లే బస్టాప్ వద్ద హనుమంతును అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు సీఐ తెలిపారు.