కార్మికుల వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ ఆధ్వర్యంలో బుధవారం దేవనకొండ తహశీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ. కార్మిక చట్టాల పరిరక్షణ, కార్మిక హక్కులను కాలరాయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. స్కీం వర్కర్‌కు కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర కార్మిక చట్టాలు అమలు చేయాలన్నారు.