మెడికల్ కాలేజ్ పనులు ప్రారంభించాలని ఆలూరు ఎమ్మెల్యేకు వినతి

53చూసినవారు
ఆదోనిలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల పనులను వెంటనే పునఃప్రారంభం చేయాలని శుక్రవారం విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షికి వినతిపత్రం అందజేసినట్లు ఎస్ఎఫ్ఎ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు తెలిపారు. కళాశాల నిర్మాణం పూర్తి దశలో ఉన్నప్పటికీ రాజకీయ లబ్ది కోసమే పనులు నిలిపివేసినట్లు ఆరోపించారు. కాలేజీ గురించి అసెంబ్లీలో ప్రస్తావించి, వెంటనే ప్రభుత్వం పనులు నిర్వహించేలా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్