బనగానపల్లె: హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

65చూసినవారు
బనగానపల్లె: హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలి
రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి ధనుంజయ డిమాండ్ చేశారు. గురువారం బనగానపల్లెలోని బీసీ కళాశాల, స్కూల్ హాస్టల్ విద్యార్థులతో సమావేశం నిర్వహించి, మాట్లాడారు. హాస్టల్లో పెండింగ్ బిల్లులు విడుదల చేయాలన్నారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకొన్నారు. కళాశాల హాస్టల్ లో ఏఐఎస్ఎఫ్ నూతన కమిటీని 11 మందితో ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్