బనగానపల్లె మండలంలోని పెద్ద రాజుపాలెం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని.. టిడిపి నంద్యాల జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షుడు కొండు నడిపి భూషన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా టిడిపి నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేసిన మంచిని వివరించారు. ఇంటింటికి స్టిక్కరింగ్ వేసి, కరపత్రాలు పంచారు.