బనగానపల్లి పట్టణంలో ఇటీవల మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఇంటిపై డ్రోన్ కలకలం నేపధ్యంలో సోమవారం పట్టణానికి చెందిన వైసీపీ నాయకులు అబ్దుల్ ఫేస్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పోలీసు స్టేషన్ కు చేరుకుని ధర్నా చేశారు. అదే క్రమంలో తన భర్త వైసీపీకి చెందిన వారు కాబట్టే కక్ష సాధింపు చర్యలో భాగంగానే అకారణంగా అరెస్టు చేశారని అబ్దుల్ ఫేస్ భార్య ఆరోపిస్తుంది.