టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణతో నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు వైసీపీ నేత అబ్దుల్ ఫయాజ్ కుమారుడి వివాహంలో వీరంగం సృష్టించారు. వివాహ వేడుకలను డ్రోన్ కెమెరాతో షూట్ చేస్తున్న ఆపరేటర్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై అబ్దుల్ ఫైజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పీఎస్ ముందు మాజీ ఎమ్మెల్యే కాటసాని ధర్నాకు సిద్ధమయ్యారు.