ఘనంగా ఎస్టీయూ 78వ ఆవిర్భావ దినోత్సవం

85చూసినవారు
ఘనంగా ఎస్టీయూ 78వ ఆవిర్భావ దినోత్సవం
ప్యాపిలి పట్టణంలోని కార్యాలయంలో ఆదివారం ఎస్టీయూ 78వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్టీయూ మండల శాఖ అద్యక్షులు హాజీ మస్తాన్ వలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిలర్ వెంకట్ నాయక్ పతాకావిష్కరణ చేశారు. అమరులైన ఎస్టీయూ నాయకుల చిత్ర పటాల వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ వాణి కన్వీనర్ చిన్నపరెడ్డి, ఎస్టీయూ నాయకులు చంద్రమౌళి, కిరణ్ కుమార్, మద్దిలేటి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్