బేతంచెర్ల మండలస్థాయిలో అన్ని శాఖల అదికారులు మండల సమగ్ర అభివృద్దికి పూర్తిస్థాయిలో సహకరించాలని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం బేతంచెర్ల పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహంలో వివిధ శాఖల అధికారులు ఎమ్మెల్యే కోట్లను కలిశారు. మండల కన్వీనర్ ఉన్నం ఎల్ల నాగయ్య, పట్టణ అధ్యక్షురాలు బుగ్గన ప్రసన్నలక్ష్మి, బుగ్గన ప్రభాకర్రెడ్డి, భీమేష్ రెడ్డి, మేకల నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.