విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ప్రత్యేక ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 23న మహాధర్నాను నిర్వహించనున్నారు. ఈ ధర్నాను విజయవంతం చేయాలని ఉమ్మడి కర్నూలు జిల్లా ఇన్ ఛార్జ్ కొండా లోకేష్ రావు అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి ధర్నాలో పాల్గొనాలని ఆయన తెలియజేశారు.