
డోన్: బేతంచర్లలో టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకలు
బేతంచర్ల మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి, పార్టీకి అంకితభావంతో సేవ చేసిన మహానేతను స్మరించుకున్నారు. పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం మాట్లాడుతూ, టీడీపీని బలపరిచేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.