బేతంచెర్ల పట్టణ శివారులో ఉన్న హెచ్ కొట్టాల గ్రామం బస్ స్టాప్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ముచ్చట్ల దేవాలయం ఆదివారం పూజలు నిర్వహించినట్లు వేద పండితులు ఆదివారం తెలిపారు. ఈ క్షేత్రం నందు కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున దేవస్వామి దేవాలయమును ముక్కోటి దేవతలు దివి నుండి భువికి దిగివచ్చి ముచ్చటించుకున్నారని అందువల్ల ఈ పురాతన శైవ దేవాలయంనకు ముచ్చట్ల అనే పేరువచ్చిందన్నారు.